![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -58 లో.... భద్రవతి, సేనాపతి ఇద్దరు ప్రేమ చేసిన పనిని గుర్తుచేసుకొని బాధపడతారు. మరొకవైపు ప్రేమ కిటికీలో నుండి తన ఇంటికి చూస్తూ బాధపడుతుంటే.. వేదవతి వస్తుంది. నేను ఇలాగే చూసాను కానీ ఆ ఇంట్లో మనషులు మాత్రం కరుగరు. నేను ఆ బాధని అనుభవించాను.. ఇప్పుడు నా ప్లేస్ లో నువ్వు ఉన్నావ్. నా భర్త ప్రేమ తో నేను మర్చిపోయాను.. నీకు అలాంటి ప్రేమ దొరుకుతుందనుకుంటున్నానని వేదవతి అంటుంది.
ఆ తర్వాత తిరుపతి, చందు ఇద్దరు బయటకు వచ్చి పడుకుంటారు అసలు ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకోవడం ఏంటని తిరుపతి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి వాష్ రూమ్ ఎక్కడ ఉందని అడుగుతుంది. బయటుంది వెళ్ళమని అంటాడు. నాకు తెలియదని ప్రేమ అనగానే.. ధీరజ్ తీసుకొని వెళ్తాడు. అది చూసిన నర్మద, వేదవతి ఇద్దరు.. వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుంటారన్న హోప్ వస్తుందని అనుకుంటారు. ఆ తర్వాత నాకు ఆకలిగా ఉంది అత్తయ్య అని నర్మద అనగానే.. నీకు నాకు మాటలు లెవ్వు కానీ తిందాం పదా అని వేదవతి అంటుంది.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ లు.. ఇన్నిరోజులు గొడవపడ్డ విషయలు గుర్తుచేసుకొని ఇద్దరు ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు. మరుసటిరోజు ఉదయం కామాక్షి చిన్నోడి పెళ్లికి కూడా ఆడపడుచు కట్నం రాలేదని ఫీల్ అవుతుంది అసలు ప్రేమని ప్రేమించిన విషయం ఎందుకు చెప్పలేదని ధీరజ్ ని చందు, సాగర్ అడుగుతారు. ఎక్కడ జరిగింది చెప్తాడోనని నర్మద వచ్చి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |